మాచర్ల నియోజకవర్గం..థర్డ్ సింగిల్

28
nithin
- Advertisement -

ఎంఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వ‌లో నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. నితిన్ సరసన క్యాథరీన్ థ్రెసా, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తుండ‌గా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆగ‌స్టు 12న సినిమా విడుదల కానుండగా సినిమాలోని థ‌ర్డ్ సింగిల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.

‘అదిరింది’ అంటూ సాగే మెలోడియ‌స్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుద‌ల చేశారు. ఈ పాట‌లో నితిన్‌, కృతి శెట్టి మ‌ధ్య‌ కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరిద్ద‌రి డ్యాన్స్ మూవ్‌మెంట్స్ అల‌రిస్తున్నాయి. కృష్ణ‌కాంత్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను సంజిత్ హెగ్డే ఆల‌పించాడు.

ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టించిన‌ ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.

- Advertisement -