కామెడీ స్క్రిప్టులతో ఎవరూ నా దగ్గరకు రావడం లేదు అంటూ స్టార్ హీరో ఆవేదన వ్యక్తం చేశారు. కోలీవుడ్ ప్రముఖ నటుడు శివకార్తికేయన్ ఇటీవల పరాశక్తి అనే పీరియడ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేక పోయింది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ మాట్లాడుతూ… తనకు ఇటీవలి కాలంలో సరదా, కామెడీ స్క్రిప్టులతో దర్శకులు ఎవరూ రావడం లేదని నిరాశ వ్యక్తం చేశారు. ఈ మధ్య నాకు కామెడీ స్క్రిప్టులు రావడం లేదు. నేను ఎందుకు కామెడీ సినిమాలు చేయడం లేదని అందరూ అడుగుతున్నారు. కానీ పూర్తిస్థాయి కామెడీ కథతో ఎవరూ నా దగ్గరకు రావడం లేదు. బడ్జెట్ వంటి అనేక అంశాలు ఇందులో పాత్ర వహిస్తున్నాయి. అయితే నా తదుపరి చిత్రం మాత్రం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది అన్నారు.
అయితే పరాశక్తి, అమరన్ వంటి సినిమాలు నాలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాయి. అయినప్పటికీ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలు చేయడం నాకు చాలా మిస్ అవుతోంది. దురదృష్టవశాత్తూ పూర్తిస్థాయి కామెడీ స్క్రిప్ట్‌ను ఎవరూ నారేట్ చేయడం లేదు అని తెలిపారు.
Also Read:ఈడీ సోదాలు..కోట్ల రూపాయలు స్వాధీనం

