- Advertisement -
నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను కో-లొకేషన్ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి…సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. మార్చి 07వ తేదీ సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.
చిత్రా రామకృష్ణన్ సీఈవోగా ఉన్నకాలంలో ఎన్‌ఎస్‌ఈలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఆమె ఓ హిమాలయ యోగి ఆదేశాల మేరకు పనిచేశారని, కీలక సమాచారాన్ని లీక్ చేశారని, అనర్హులకు పదవులిచ్చారని పలు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో ఆమెపై 2018 మేలో కేసు నమోదైంది. చిత్ర ముందస్తు బెయిల్ కోసం చేసుకొన్న దరఖాస్తును సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసిన తర్వాతే రోజే ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు.
- Advertisement -