హైదరాబాద్‌లో ప్రవాస భారతీయుల సమావేశం

317
NRI's Meet in Hyderabad
NRI's Meet in Hyderabad
- Advertisement -

హైదరాబాద్ లోని న్యూయార్క్ టవెర్న్ హోటల్ లో వివిద దేశాలనుండి వచ్చిన సుమారు 100 మంది ప్రవాస తెలంగాణ వాదులు సుమారు 8 గంటలు సమవేశం అయ్యారు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఎటువంటి రాజకీయ ప్రస్తావన లేకుండా అభివృద్ది చేస్తూ ఒక మార్పు తీసుకువచ్చిన కొంతమంది చేంజ్ లీడర్ల తో మాట ముచ్చట. ఈ సమావేశానికి ముఖ్య అథిదులుగా రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ శ్రీ ఆయచితం శ్రీధర్ గారు, టి.శాట్ టి.వి శ్రీ శైలెష్ రెడ్డి గారు హాజరు అయ్యారు. అమెరికా లో నివసిస్తూ మాతృ భూమి కోసం సేవ చేస్తున్న అనేక మంది ప్రవాస తెలంగాణ వాదులు తమ తమ అనుభవాల్ని పంచుకున్నారు.

NRIs Meet1

ఈ సంధర్బంగా శ్రీ శైలెష్ రెడ్డి..మాట్లడుతూ 2001 లో స్తాపించబడ్డ రాష్ట్ర ప్రభుత్వ ఆధినం లోని సాఫ్ట్ నెట్ టి.వి సమైక్య పాలనలో ఎంత నిర్లక్ష్యం చేయబడింది. దానిని తను సి.ఈ.ఓ గా చేరిన తరవాత ఎలా ముందుకు తీసుకెల్తుంది సవివరంగా చెప్తునే ప్రవాస తెలంగాణ వాదులు అమెరికా లాంటి అభివ్రుద్ది చెందిన దేశాల్లోని విద్యా విదానం కు సంబందించిన కాంటెంట్ ఉంటే పంపించాలని కోరారు. సగానికిపైగ మూతబడ్డ ప్రభుత్వ పాఠశాల్లోని టి.వి ప్రసారాలకు సంబంధించి చొరవ తీసుకొని వీలైన సహయం చేస్తే తెలంగాణ ప్రాంత విద్యార్దులకు మంచి విద్య తో పాటూ ఉద్యోగస్తులకు అవసరమైన సమాచారం టి.సాట్ మరియు టి.ఆకాడమి చేరవేస్తుందన్నారు.

శ్రీ ఆయచితం శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ కు సంబందించి లైబ్రరీలు పోటీ పరీక్షలకు చాల ఉపయోగ పడ్డ విధానం అని చెప్పారు. విదేశాల్లోని అత్యాధునిక టెక్నలాజీ ఉపయోగించి ప్రవాసులు ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లోని లైబ్రరీలు బలోపేతం చేయాల్సిందిగా కోరారు. పూర్వ కాలంతో పోలిస్తే గ్రంధాలయాల ఉపయోగం మరింత పెరిగితేనే యువతలో మార్పు వస్తుందని, తద్వారా సమజంలో మంచితనం పెరుగుతుందన్నారు. అదేవిదంగా అమెరికా లాంటి దేశాల్లోని ప్రవాసులు నెలలో ఒకరోజు తమ తమ ప్రాంతాల్లోని గ్రంధాలయల నిర్వహకులతో, సందర్షకులతో మాట్లడుతూ అక్కడి అవసరాలు ఎమైన ఉంటే చూడాలని కోరారు.

NRI Meet2

వుమెన్ ఎంపవర్మెంట్ మీద వంశి మాచినేని, టీ విత్ హెడ్మాస్టర్ కార్యక్రమం గురించి జలగం సుధీర్, సేవ్ జనగాం మీద మంగలం పెల్లి రాజు, తోపుడూ బండి నిర్వహణ మీద సాదిక్ ఆలి, జీరో ఎలెక్షన్ బడ్జెట్ మీద పి.మాధవ రెడ్డి, వ్యవసాయ విధానం మీద మెండు శ్రీనివాసులు, సేవ్ రైన్ వాటర్ మీద సుభాష్ రెడ్డి, గిఫ్ట్ అ ఫ్లాగ్ మీద సుర్యాలెఖ, హరిత హారం మీద వన జీవి సురెష్ గుప్తా, గ్రామాల అభివ్రుద్ది మీద సర్పంచ్ యాకుబ్ రెడ్డి, తెలంగాణ సినిమా రంగం అభివ్రుది మీద నటుడు, నిర్మాత రఫి, బయో డైవర్సిటి మీద నరెందర్ ముప్పారపు, డేటా అవసరాల మీద రాకెష్ దుబ్బుడు, జర్నలిజం మీద రజనికాత్ ఎర్రబెల్లి , మెకిన్ తెలంగాణ అంశం మీద స్పందన ఆయచితం(UK), సేవ భారతి మీద రఘు వెరబెల్లి, మోడల్ విలేజ్ మీద బాల్ రాజ్ గౌడ్, తెలంగాణ అభివృద్ది మీద లక్ష్మన్ అనుగు తదితరులు తమ తమ ప్రజంటేషన్స్ చేసారు.

ఇంతమంది ప్రవాస భారతీయుల్ని ఒక దగ్గర చేర్చిన నిర్వహకులు రవి మేరెడ్డి, జలగం సుధీర్, శాంతి పుట్టా, భరత్ యడ్మ లను గ్రంధలయ సంస్థ చైర్మన్ వారి సంస్థ తరపున మొమెంటొ లన ఇచ్చి అభినందించారు.

ఈ కార్యక్రమానికి డి.పి.రెడ్డి, నళనిధర్ రెడ్డి, శ్రినివాస్ రనబోతు, మహేష్ తన్నిరు, ఉపెందర్ రెడ్డి గాదే, రవిందర్ గడ్డంపల్లి, గాల్ రెడ్డి,సురెశ్ గుడిపురి, హరి కాసుల, క్రిషి సంస్థ ప్రతినిది ప్రదీప్ మంద, వెంకట్ రెడ్డి, శ్రినివస్ మామిడి తదితరులు హాజరయి తమ తమ అభిప్రాయాలు పంచుకున్నరు.

- Advertisement -