తెలంగాణ ఎన్నారై బడ్జెట్‌పై ప్రవాసుల హర్షం

228
NRIs laud CM KCR
- Advertisement -

లండన్ లో ఎన్నారై తెరాస యూకే ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ,ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసారని తెలిపారు.

ఈ సందర్బంగా ప్రవాసుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారికి మరియు ఎన్నారై శాఖ మంత్రి కేటీయార్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

ముఖ్యంగా గల్ఫ్ తెలంగాణ వాసుల కష్టాలు తీర్చేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడే అవకాశం చాలా ఉందని, కచ్చితంగా ఈ చారిత్రాత్మక నిధుల కేటాయింపుతో గల్ఫ్ బిడ్డల జీవితాల్లో కొత్త భరోసా కలుగుతుందని, ఈ నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తూ, తెలంగాణ బిడ్డ ప్రపంచం లో ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం కెసిఆర్ గారి చేస్తున్న కృషి గొప్పదని వారిని ప్రశంసించి కృతఙ్ఞతలు తెలిపారు.

గత పాలకులకు ఎన్నారైల పట్ల చిత్తశుద్హి లేదని, తెలంగాణ ఏర్పడక ముందు ఏన్నారై శాఖ బడ్జెట్ కేవలం రు 5 కోట్లు ఉండేదని, వారి సంక్షేమం కోసం చేసిన పనులేవీ లేవని, కానీ తెరాస ప్రభుత్వం లో ఎన్నారైల పట్ల అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తో పని చేస్తున్నారని, ముఖంగా గల్ఫ్ బాధితుల పట్ల ఎప్పటికప్పుడు కేటీయార్ గారు మరియు కవిత గారు స్పందిస్తున్న తీరు, వారి బాధ్యతకు, గల్ఫ్ బిడ్డల సంక్షేమం పట్ల వారి చిత్తశుద్ధిని తెలుపుతున్నదన్నారు .

నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ బడ్జెట్ ని ప్రవాసులు హర్షిస్తున్నారని, మీడియా సమేవాశం లో పాల్గొన్న ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, శ్రీకాంత్ పెద్దిరాజు మరియు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శి సృజన్ రెడ్డి తదితరులు తెలిపారు.

- Advertisement -