పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు వెంటనే తగ్గించాలి- NRI TRS

72
- Advertisement -

బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అడ్డగోలుగా పెంచుతున్న గ్యాస్‌, పెట్రోల్‌ ధరలకు నిరసనగా తెరాస పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ గారి పిలుపుమేరకు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు.

అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గత ఏడు సంవత్సరాల బీజేపీ పాలనలో సామాన్య ప్రజల బతుకు ఆగంమైందని, ఇష్టానుసారంగా ధరలు పెంచి సామాన్యులు బతకలేని స్థితికి తీసుకొచ్చారని తెలిపారు.

కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని, దేశ ప్రజలంతా మోడీకి రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్తారని అనిల్ తెలిపారు.సందర్భం ఏదైనా మనమంతా కెసిఆర్ వెంటే ఉండాలని, దేశాన్ని కాపాడి ముందుకు నడిపించే శక్తి నేడు కెసిఆర్‌కు మాత్రమే ఉందని త్వరలో దేశ రాజకీయాల్లో కెసిఆర్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నట్టు అనిల్ తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకులు ముఠా జయసింహ, ఎన్నారై తెరాస నాయకులు స్థానికుడు వల్లాల శ్రీనివాస్ యాదవ్‌కు మరియు స్థానిక తెరాస నాయకులకు, హాజరైన మహిళలకు, తెరాస కార్యకర్తలకు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -