తెలంగాణపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం..

77
- Advertisement -

నేడు రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని, రాష్ట్ర ఏర్పాటును వారు ఎంత వ్యతిరేకిస్తున్నరో తెలంగాణ ప్రజలకు అర్థం అవుతున్నదని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఒక పక్క రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదనుకుంటూనే ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతున్నారని, తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని, బిజెపి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని లేకుంటే గతంలో వంద నియోజకవర్గాల్లో డిపాజిట్ గల్లంతు చేసినట్టే రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో అదే భంగ పాటు తప్పదని అనిల్ హెచ్చరించారు.

నాటి నుండి తెలంగాణ ప్రజల్ని బిజెపి మోసం చేస్తూనే ఉందని, విభజన పద్దతిని వ్యతిరేకిస్తున్న మోడీ, గతంలో అవకాశం ఉన్నప్పటికీ బిజెపి పార్టీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రజలని మోసం చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలని, తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే ముందు విభజన హామీలు నెరవేర్చాలని అనిల్ తెలిపారు.

కెసిఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక మోడీ విషం చిమ్ముతున్నారని, గత 7 సంవత్సరాల బిజెపి ప్రభుత్వ హయాంలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు చేసిన న్యాయం ఏంటో చెప్పాలని, అవకాశం ఉన్నప్పుడు అభివృద్ధి చేసే మనసు బిజెపికి లేదని, తెలంగాణ మీద చూపెడుతున్న వివక్షని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సందర్భంలో తగిన బుద్ది చెప్తారని అనిల్ తెలిపారు.

- Advertisement -