ఎన్నారై టీఆర్ఎస్ బహ్రెయిన్…గల్ఫ్ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. మూడు సంవత్సరాల క్రితం బ్రతుకు దెరువుకు బహ్రెయిన్ వచ్చిన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రంగారావు పేట్‌కు చెందిన గూగులవత్ రాజేందర్ (29) ఒక ప్రవేట్ కంపెనీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో పనిలో ఉన్న సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయింది.
ఆ యాక్సిడెంట్ లో రాజేందర్ రెండు కాళ్ళు విరిగిపోయాయి. దీంతో రాజేందర్ బంధువులు ఎన్నారై టీఆర్ఎస్ ప్రతినిధులను కలిసి సాయం చేయాలని కోరారు. ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బృందం వెంటనే కింగ్ హమ్మెద్ హాస్పిటల్ కు వెల్లి పరామర్శించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాను పనిచేస్తున్న కంపెనీ రెండు నెలల నుంచి జీతం ఇవ్వటం లేదని రాజేందర్…ఎన్నారై టీఆర్ఎస్ ప్రతినిధులకు తెలిపాడు.ప్రతి రెండు రెండు వారాలకు హాస్పిటల్ కు వెళ్లాల్సిందేనని…..చేతిలో డబ్బు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రాజేందర్ చికిత్సకు కావాల్సిన ఆర్ధిక సాయాన్ని అందించారు.
ఎవరికీ ఏ ఆపద వచ్చిన తెలంగాణ బిడ్డలకు తమ వంతు సహాయం అందజేస్తామని ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు తెలిపారు. సతీష్ కుమార్ వెంట ఉపాద్యక్షులు వెంకటేష్ బొలిశెట్టితో పాటు ఇతర నాయకులు ఉన్నారు.