మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన రెండో టీ20 వర్షార్పణం అయింది. భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా టీఆర్ఎస్‌ను గెలిపించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఓట్ ఫర్ కార్ అని ప్లకార్డులు ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని గెలిపించాలని ఆసీస్ టీఆర్ఎస్ నేత కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.
ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన భారత్‌కు ఇది నిరాశ కలిగించేదే. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా వర్షం ఆటంకం కలిగించే సమయానికి 19 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. వర్షం తగ్గకపోవడంతో ఇన్నింగ్స్ అక్కడికే ముగిసిపోయింది. తొలి టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా 1-0తో భారత్‌పై ఆధిక్యం సాధించింది.మూడో టీ20 ఆదివారం సిడ్నీలో జరగనుంది.