మాజీ మంత్రి హరీష్ రావు పై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంపై ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే.. రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారు.ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీశ్‌రావు కేసులు నమోదు చేయడం సరికాదు.ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతలి వ్యక్తి ఎవరూ? వారి చరిత్ర ఏంటి, విశ్వసనీయత ఏంటీ అని పోలీసులు ఆలోచించాలి. చక్రదర్‌గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే.. ఎలాంటి ఆధారాలు లేకున్నా హరీశ్‌రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు పెట్టడం హాస్యస్పదం అన్నారు.హరీశ్ రావు వ్యక్తి కాదు శక్తి అన్నారు.
మేము కూడా కేసులు పెడతాం.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా?,ముఖ్మమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను బుల్డోజర్లు ఎక్కిస్తాం అని అంటున్నా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. రైతు రుణమాఫీ, రైతుబంధు, వృద్ధులకు, వికలాంగులు పింఛన్, మహిళలు 2500, కేసీఆర్ కిట్లు, నిరుద్యోగులకు భృతి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవన్నీ ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్ ప్రశ్నిస్తే.. వాటికి సమాధానం చెప్పలేక, తప్పుడు కేసులు పెడుతున్నారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఫోన్ ట్యాపింగ్‌కు హరీశ్‌రావుకు ఎలాంటి సంబంధం లేదు. తక్షణమే మాజీ మంత్రి హరీశ్ రావుపై పెట్టిన బూటకపు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
Also Read:KTR: వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్.. నిరూపిస్తే రాసిస్తాం