ఎన్నారై టీఆర్ఎస్ -యుకె నూతన కార్యవర్గం

192
NRI TRS CELL - UK New Committee
- Advertisement -

బంగారు తెలంగాణ సాధనకు ఎన్నారైలందరు సహకరించాలని ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం అన్నారు. ఖండాతరాల్లో ఉన్నప్పటికీ నాటి ఉద్యమం నుంచి నేటి వరకు పార్టీ జెండా మోసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ – యుకె నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నారై ట్.ఆర్.యస్ – యుకె  నూతన కార్యవర్గ సమావేశం లండన్ లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అధ్యక్షతన జరిగింది .

ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా పటిష్ట నాయకత్వంతోనే సాధ్యమవుతుందని ,తెలంగాణ పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర సమితి కట్టుబడి వుందని అనిల్ తెలిపారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. అట్టడుగువర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

NRI TRS CELL - UK New Committee

అందరం బాధ్యతతో, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అన్ని సందర్భాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్‌ శాఖల సమన్వయం ఎంతో స్ఫూర్తినిస్తుందని, ఇందుకు సహకరిస్తున్న అన్ని శాఖల కార్యవర్గ సభ్యులకు కృతఙతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎన్నారైల కృషి తదితర విషయాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు ,ఆచార్య జయశంకర్ సర్ కి నివాళులు అర్పించారు.

ప్రధాన కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ, కార్యవర్గ సమావేశం ప్రతి సభ్యునిలో నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ అన్నారు. ఈ సమావేశానికి హాజరై విలువైన సూచనలను సలహాలను అందించినందుకు,  ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం విజయవంతానికి ప్రత్యేకంగా కృషి చేసిన ఈవెంట్ కమిటీ సభ్యులు  సత్యపాల్ పింగిళి, నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పెద్దిరాజు వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

సమావేశంలో తీర్మానాలు

1.  ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  పుట్టినరోజు వేడుకలను లండన్ లో  ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

2. ప్రభుత్వ పథకాలను వినూత్నమైన పద్ధతిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కృషి చెయ్యాలని నిర్ణయించారు.

NRI TRS CELL - UK New Committee

3.  నూతనంగా పదవులు చేపట్టిన సభ్యుల బాధ్యతలను వివరించి,  ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని సంస్థ చేసిన కార్యక్రమాల  పై ఒక బులెటిన్ కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.

4. టీఆర్ఎస్   ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు, వారికి మద్దతు తెలుపుతున్న వ్యక్తులకు – సంస్థలకు సరైన రీతిలో ప్రతివిమర్శన చేసి, నిజా నిజాలు ప్రజలకు తెలిసేలా, ఇటు ప్రత్యక్ష మీడియా ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని  నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి,అశోక్ దూసరి ,శ్రీకాంత్ పెద్దిరాజు ,సంయుక్త కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సృజన్ రెడ్డి ,సంయుక్త కార్యదర్శి సేరు సంజయ్ ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,IT సెక్రటరీ వినయ్ ఆకుల , లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి బండ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్ ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి ,ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల  ,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం , మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని,అశోక్ కుమార్ అంతగిరి ,చిత్తరంజన్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -