ఎన్నారై టి. ఆర్. యస్ యుకె ఆద్వర్యం లో లండన్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఇటీవల తెలంగాణ మంత్రి కేటిఆర్ గారి పై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శల పై ఘాటుగా స్పందించారు. ఎన్నారై టీ.ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, తెలంగాణ మంత్రి కేటిఆర్ గారి పై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల నాడు తెలంగాణ ఉద్యమానికి మరియు నేడు తెలంగాణ నిర్మాణానికి ఎటువంటి ఉపయోగం లేదని, ప్రజల్లో వారి ఉనికి కాపాడుకోవడం కోసం, రాజకీయ లబ్ది కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, మొన్నటి సాధారణ ఎన్నికల్లల్లో పట్ట పగలే కోట్ల రూపాయలతో దొరికిన ఒక అవినీతిపరుడవని, కనీసం రాజకీయాల్లల్లో ఉండే అర్హత లేని నీవు, నేడు కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా తన ప్రతిభ తో యావత్ భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మంత్రి కేటిఆర్ గారిని విమర్శించడం మీ అవివేకానికి నిదర్శనమని తీవ్రంగా మండి పడ్డారు.
ఇలా చిల్లర మాటలతో తెలంగాణ నాయకత్వాన్ని అగౌరవ పరిచి, ఎదో నిరుత్సాహపరుస్తామనుకుంటే అది అరణ్య రోదనే అవుతుందని, తెలంగాణ ప్రజలు మీకంటే చైతన్యవంతుల్ని అందుకే నాటి ఉద్యమం నుండి నేటి వరకు తెరాస పార్టీ వైపు ఉన్నారని, ఇలాగే విమర్శలు చేస్తే కనీసం మిమ్మల్ని ఊర్లోకి రానిచ్చే పరిస్థితి ఉండదని తెలిపారు.
చాతనైతే, నిజంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి పై చిత్త శుద్ధి ఉంటే, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు.
ఎన్నారై టి .ఆర్ .యస్ ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు .మొత్తం ఇండియా లోనే యూత్ ఐకాన్ గా వున్న కేటీర్ గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించడం సిగ్గుచేటు అని దీనిని ఎన్నారై టి .ఆర్ .యస్ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు . ఈ మూడేళ్ళ కాలంలో అన్నిరంగాలలో తెలంగాణా ఎంతో అభివృద్ధి సాధించించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు .
తెలంగాణా ప్రభుత్వం మనం కలలు కన్న బంగారు తెలంగాణ నిర్మించడానికి అహర్నిశలు శ్రమిస్తుందని, తెలంగాణ రాష్ట్రం లో అమలు పరుస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమన్నారు .
ఇకనైనా నిర్మాణాత్మక సలహాలు ,సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలనీ లేదనే చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని తెలిపారు .
ఎన్నారై టిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి, సెక్రటరీ శ్రీ చాడ సృజన్ రెడ్డి మాట్లాడుతూ TPCC అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటిఆర్ ని బచ్చా అని సంబోదించడం ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ అహంకారానికి నిదర్శనం అన్నారు. కేటిఆర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే వయసులు చిన్న వారే కానీ రాజకీయ పరిపక్వత లో, తెలంగాణాని అభివృద్ధి పదం లో నడిపివ్వడం లో, విదేశీ పెట్టుబడులు తీసుకరావడం లో కేటిఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ఎన్నో రేట్లు పెద్ద వారీగా, అనుభవం ఉన్న వారీగా పని చేస్తున్నారు అని గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన పదజాలం యావత్తు యువ నాయకులను అవమానించినట్టు ఉన్నదని కావున ఉత్తమ్ కుమార్ రెడ్డి యువ నాయకులకు అందరికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్ర కు మూడవ పంట కోసం నిర్దాక్షిన్యంగా 14000 ఎకరాలను నీట ముంచిన పులిచింతల ప్రాజెక్ట్ ని పొగడడం అంటే ఆయనకు తెలంగాణా మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్ధం అవుతుంది అని ప్రజలకు గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక తెలంగాణా ఇచ్చింది తప్ప తెలంగాణ మీద ప్రేమ తో కాదు అని అందుకే తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పారు అని అన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ దొంగ ప్రేమను అర్ధం చేసుకొని ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ని చావు దెబ్బ కొట్టాలనని, కాంగ్రెస్ భూస్థాపితం అయిన నాడే తెలంగాణా అభివృద్ధికి ఆటంకాలు తొలగుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ని పాతాళం కంటే పది కిలోమీటర్ల లోపల పాతి పెట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.