ఘనంగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్ 6 వ వార్షికోత్సవం

313
NRI TRS CELL - 6th Anniversary
- Advertisement -

లండన్ లో ఎన్నారై టి.ఆర్.ఎస్ సెల్ ఆరవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు, తెలంగాణ టూరిజం మంత్రి  అజ్మీరా చందూలాల్ మరియు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. యు.కే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు.

ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ ముఖ్య నాయకుడు చాడా సృజాన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమానికి, ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళులు అర్పించారు.

NRI TRS CELL - 6th Anniversary

ఎన్నారై టి.ఆర్.ఎస్ సెల్ ఆరు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియో ని ప్రదర్శించి, అతిథులకు వివరించారు. ఇది చూసి హాజరైన ప్రతి ఒక్కరు ఉద్వేగానికి లోనయ్యారు.

చందూలాల్ మాట్లాడుతూ, ఉద్యమం లో ఎన్నారై ల పాత్ర గొప్పదని తెలిపారు, బంగారు తెలంగాణ నిర్మాణ దిశ లో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ముఖ్యంగా పర్యాటక రంగం లో ప్రభుత్వం చేపట్టిన వివిధ నిర్ణయాలను తెలిపారు. అలాగే తను లండన్ లో గత కొన్ని రోజులు గా హాజరైన ” ట్రావెల్ ఎక్పో” విషయాలను సభకు వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ఖండాంతరాల్లో ఎన్నారై లు చాటి చెప్తున్న తీరు గార్వకారణమన్నారు. సంధర్భం వచినప్పుడు తెలంగాణ సమాజాం కోసం క్రియాశీలకంగా పని చేస్తున్న ఎన్నారైలను స్వరాష్ట్రం కి ఆహ్వానించి సత్కరిస్తామని తెలిపారు.

NRI TRS CELL - 6th Anniversary

విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రతి దేశం లో మనం నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయని, ప్రవాస బిడ్డలుగా ఇక్కడ నేర్చుకున్న విషయాలను ….ఉదాహరణకి, “డిగ్నీటి ఆఫ్ లేబర్”, “పరిశుభ్రత” , ఇలా ఎన్నో స్వదేశం వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రజలకు వివరించి మార్పుకు తోడ్పడాలని సలహనిచ్చారు. యువత కేవలం ఉద్యోగలకే పరిమితం కాకుండా, ఎంటర్ ప్రీనర్స్ గా ఎదిగేలా కృషి చేయాలని, ఏదైన సలహాలు కావాలంటే నన్ను సంప్రదించొచ్చని తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా పార్టీ ఎన్నారై శాఖను ముందుండి నడిపిస్తున్న అనిల్ కూర్మాచలం ని అభినందించి సభ్యులకు 6 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లో లండన్ లోని టి.ఆర్.ఎస్ సెల్ పాత్ర గొప్పదని కీర్తించారు.

NRI TRS CELL - 6th Anniversary

ఎన్నారై. టి.ఆర్.ఎస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ , ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు చందూలాల్ మరియు విశ్వేశ్వర్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చడం మన చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై టి.ఆర్.ఎస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ మరియు యావత్ టి.ఆర్.ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్  ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు. కార్యవర్గ సభ్యులకి 6 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

లండన్ లో కరాటే పోటీలకు వచ్చిన OUJAC అద్యక్షులు కరాటే రాజు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ, ఎన్నారై టి.ఆర్.ఎస్ వారితో తనకు ఉద్యమం లో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు, అలాగే లండన్ లోని ఎన్నారై ల పాత్రను ప్రశంసించారు.

NRI TRS CELL - 6th Anniversary

ఆ తరువాత కేకు కట్ చేసి 6 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ప్రవాస తెలంగాణ బిడ్డలు మంత్రి చందులాల్ ఆధ్య్వర్యమ్ లో టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు. వారిని కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

చివరిగా, మంత్రిని, ఎంపీ ని శాలువా తో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించారు.

NRI TRS CELL - 6th Anniversary

కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శులు నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి,యూకే ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి రేకుల ,లండన్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల,సభ్యులు సతీష్ రెడ్డి బండ, సెరు సంజయ్, సృజన్ రెడ్డి,హరి నవపేట్, మల్లా రెడ్డి, సత్యపాల్ ,సత్యం రెడ్డి కంది,రాజేష్ వర్మ ,మధుసూధన్ రెడ్డి, శ్రీనివాస్ కలకూంట్ల, వినయ్ ఆకుల, వీర ప్రవీణ్,గణేశ్ పస్తమ్,నవీన్ భువనగిరి,వేణు రెడ్డి, సత్య జిల్లా, రాకేష్ ,సత్య చిలుముల,రవి ప్రదీప్,హాజరైన వారిలో ఉన్నారు.

- Advertisement -