‘ఎన్నారై బీఆర్ఎస్ యుకే’..కార్యవర్గ సమావేశం

3
- Advertisement -

 ఎన్నారై టి. బీ.ఆర్.యస్ యూకే కార్యవర్గ సమావేశాన్ని లండన్ లో నిర్వహించినట్టు అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎఫ్దీసి మాజీ చైర్మన్ మరియు ఎన్నారై టి. బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ముఖ్య అతిధిగా హాజరయినట్టు అశోక్ గౌడ్ తెలిపారు.

ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం సభ్యులందరితో మాట్లాడుతూ …..ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం పూర్తయినా, హామీలిచ్చిన ఏది కూడా అమలు చేయకపోవడం, రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగించడం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఇలా రాష్ట్రాన్ని మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్న సందర్భంగా రానున్న రోజుల్లో బాద్యత గల బీ.ఆర్.యస్ కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడి సోషల్ మీడియా వేదికగా, అలాగే లండన్ లో ప్రత్యేక నిరసన కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలిపారు. పార్టీ అధ్యక్షులు కెసిఆర్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చే ప్రతీ పిలుపుకి స్పందించి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని నిర్ణయించినట్టు ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు.

మహబూబ్నగర్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ నాయకుడు సాయి బాబా కోట్ల అనిల్ కూర్మాచలం ఆధ్వర్యంలో బీ.ఆర్.యస్ పార్టీ లో చేరడం జరిగింది. సాయి బాబా కోట్ల మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నియోజికవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పని చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
యూకే వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్లినా కెసిఆర్ కేటీఆర్ గార్ల పది సంవత్సరాల ప్రగతి పై అందరూ మాట్లాడుతుంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉండి వీరిని వ్యతిరేకించినందుకు చాలా బాధపడ్డానని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తెలంగాణ ప్రజలకు మేలు జరగాలంటే కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో బీ.ఆర్.యస్ పార్టీ లో చేరుతున్నట్టు సాయి బాబా కోట్ల తెలిపారు.ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పని చేసి ఎంతో కష్టపడి, నేడు అధికారం వచ్చినప్పుడు అందులో ఉండకుండా తెలంగాణ అభివృద్ధి కేవలం కెసిఆర్ గారి నాయత్వంతోనే జరుగుతుందని భావించి బీ.ఆర్.యస్ పార్టీ లో చేరిన సాయి బాబా కోట్ల ను అభినందించి, రానున్న రోజులల్లో వారికి తగిన గౌరవం పార్టీ ఇస్తుందని, అలాగే వారి అనుభవాన్ని నాయకత్వాన్ని కూడా పార్టీ ఉపయోగించుకుంటుందని, వారిని పార్టీలోకి అనిల్ కూర్మాచలం స్వాగతించారు.

రానున్నరోజుల్లో కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా ప్రశ్నిస్తామని క్షేత్రస్థాయిలో నాయకులని కార్యకర్తలనిసమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉంటామని, ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఉదృతంగాకాంగ్రెస్ పార్టీని నిలదీసి వీరి అరాచక పాలనను మోసాలను ఎండగట్టి ప్రజలకు దేశానికి తెలిసేలాచేస్తామని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల తెలిపారు.

Also Read:మైటా వార్షికోత్సవాల్లో బీఆర్ఎస్ నాయకులు

కార్యవర్గ సభ్యుల ఆలోచనలు సలహాలతో ప్రత్యేక కార్యాచారణ రూపొందించినట్టు అడ్వైసరి బోర్డు వైస్ చైర్మన్ సీక్క చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ఏర్పాటు చేసిన పద్నాలుగు సంవత్సారాలైన సందర్భంగా ముఖ్య నాయకులంతా కేక్ కట్ చేసి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.సీనియర్ నాయకులు గణేష్ కుప్పలా మాట్లాడుతూ యూకే లో వివిధ వేదికల్లో పాల్గొన్నప్పుడు ఇప్పటికీ కెసిఆర్ కేటీఆర్ గార్ల ప్రగతి గురించే వివిధ రంగాలకు చెందిన విదేశీయులు ప్రస్తావిస్తున్నారని, తెలంగాణ ఏం కోల్పోయిందో రానున్న రోజుల్లో ప్రజలకు ఇంకా అర్థమవుతుందని తెలిపారు.

ఇటీవల ఉన్నత విద్యకోసం లండన్ వచ్చిన బీ.ఆర్.యస్ వీ రాష్ట్ర నాయకులు శ్రవణ్ రెడ్డి కూడా సమావేశం లో హాజరై, ఉద్యమ సమయం నుండి లండన్ వేదికగా ద్వారా ఎన్నారై బీ.ఆర్.యస్ చేస్తున్న సేవలని చూశానని , నేడు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి మళ్ళీ కెసిఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎత్తుకొని తెలంగాణ ప్రజల కోసం పని చేయడం సంతోషంగా ఉందని, నేను రాగానే నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన బీ.ఆర్.యస్ కుటుంబసభ్యులకు కృతఙ్ఞతలు తెలిపి, రానున్న రోజుల్లో అదే స్పూర్తితో ఇక్కడ ఇచ్చిన ప్రతీ బాధ్యతను నిర్వహించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రవణ్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యవర్గ సభ్యులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల,సీక్క చంద్రశేఖర్ గౌడ్, రవి ప్రదీప్ పులుసు, శ్రీధర్ రావు, ప్రవీణ్ వీర, సురేష్ గోపతి, వెంకట్ రెడ్డి దొంతుల, హరినవాపేట్, సతీష్ రెడ్డి బండ, రవి రేతినేని, గణేష్ కుప్పాల, శ్రీకాంత్ జెల్లా, సురేష్ బుడగం, గొట్టెముక్కల సతీష్ రెడ్డి, రమేష్ ఎసెంపల్లి, అబుజార్, గణేష్ పాస్తం, మధుసూదన్ రెడ్డి, మల్లా రెడ్డి, ప్రశాంత్ కటికనేని, రామకృష్ణ, రాజేష్ వర్మ, శ్రవణ్ రెడ్డి, సాయి బాబా కోట్ల, అంజన్ రావు, తరుణ్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -