కవితకు బెయిల్.. లండన్‌లో ఎన్నారైల సంబరాలు

3
- Advertisement -

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు కావడంతో లండన్ లో ఎన్నారైలు సంబరాలు చేసుకున్నారు. ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసాంచా కాల్చి అలాగే స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని, రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరకు న్యాయమే గెలిచిందని, కవితకు బెయిల్‌ ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టుకు ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్ధుడు మరియు ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ధన్యవాదాలు తెలిపారు.

నేడు బెయిల్ వచ్చిన విధంగానే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలా కవిత గారు బయటకు వస్తుందని, ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులని, అయినా ఒక బాధ్యతగల దేశ పౌరురాలిగా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి అన్ని రకాల విచారణలకు
కవిత గారు సహకరించారని అనిల్ కూర్మాచలం గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్.డీ.సీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీ.ఆర్.యస్ నాయకులు నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, రవి రేటినేని, సత్య చిలుముల మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:CM Revanth: సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

- Advertisement -