మధుప్రియ ఔట్‌.. ఆ అందాల భామ ఎవరు..?

233
Now Madhu Priya eleminated from House
Now Madhu Priya eleminated from House
- Advertisement -

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షో రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మూడవ వారంలోకి ఎంటర్ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు సీజన్‌1 ఎపిసోడ్‌ 14లో తనదైన శైలిలో మాటల తూటాలను పేల్చుతూ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు ఎన్టీఆర్. బిగ్‌బాస్‌ హౌస్‌లో రెండో వారానికి సంబంధించిన విషయాలను పూసగుచ్చినట్టు యంగ్ టైగర్ వివరించారు. ఈ సమీక్షలో బిగ్‌బాస్ హౌస్‌లో ఉత్తమ విలన్ ఎవరు? కత్తి మహేశ్ వండిన చికెన్, మధుప్రియ ఎలిమినేషన్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశిస్తున్న గెస్ట్ ఎవరు అనే అంశాలు ప్రధానంగా నిలిచాయి.

బిగ్‌బాస్ హాలులో సభ్యులందరిని కూర్చోబెట్టి ప్రతీ ఒక్కరి గురించి.. వారంపాటు వారు చేసిన అల్లరిని అడగడమే కాకుండా వారు చేసిన సరదా పనులను కూడా బయటపెట్టాడు ఎన్టీఆర్. బిగ్‌బాస్ హౌస్‌లో విలన్‌ ఎవరు అనే విషయాన్ని ఇంటి సభ్యులను అడిగి తెలుసుకొన్నారు. ఐదుగురు సెలబ్రిటీలు కల్పనను ఉత్తమ విలన్‌గా పేర్కొనగా, సమీర్ విలన్ అని ముగ్గురు, శివ బాలజీ, ధన్‌రాజ్‌ను ఒక్కరు నామినేట్ చేశారు. కెప్టెన్‌గా కాకముందు ఒకరకంగా.. కెప్టెన్ అయిన తర్వాత మరో రకంగా కల్పన వ్యవహరించారు. ఆమె ఓ స్ల్పిట్ పర్సనాలిటీ అనే ఆరోపించారు. వాటిని చాలా ఓపిగ్గా వింటూ కల్పన ఉండటం గమనార్హం.

ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న మధుప్రియ, సమీర్, ప్రిన్స్‌ పేర్లను చదివాడు. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నందున ప్రిన్స్ ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పించారు. ఆ తర్వాత సమీర్ సేఫ్ జోన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. వీక్షకుల ఓటింగ్ మేరకు మధుప్రియ‌ను ఎలిమినేట్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో ఏ అందమైన బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌ని షేక్ చేస్తున్నట్టు టీజర్ వదిలారు. ఇక బిగ్‌బాస్ మొదలనప్పటి నుంచి వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి కొత్త సభ్యులు వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. జరిగిన ప్రచారానికి అనుగుణంగానే ఇంటిలోకి హాట్ హాట్‌గా ఉన్న అందాల భామ ప్రవేశిస్తున్నట్టు ప్రోమోలో చూపించి ఆసక్తిరేపారు. వచ్చే అనసూయా? రేష్మీనా? లేక శ్రీయా సరన్ అనే విషయంపై చర్చ జరుగుతున్నది. ఒకవేళ శ్రీయా సరన్ అయితే బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త అందాలు అద్దినట్టే అవుతుంది. అంతేకాకుండా టాప్ స్టార్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన ఓ రికార్డుగా కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మరి ఆ అందమైన బ్యూటీ ఎవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..

- Advertisement -