రివ్యూ : నవంబర్‌ స్టోరీ

253
tamanna
- Advertisement -

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రధానపాత్రలో ఇంద్రా సుబ్రమణియన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ. క్రైమ్‌ స్టోరీ రైటరే ఓ క్రైమ్‌ లో ఇరుక్కుంటే? ఎలా ఉంటుందో అనే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను ‘ఆనంద వికటన్‌’ అనే తమిళ మ్యాగజైన్ నర్మించింది. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…

కథ :

ఫేమస్ క్రైమ్‌ నవలా రచయిత గణేశన్‌ (జి.ఎం. కుమార్‌). ఆయన కూతురు అనూరాధ (తమన్నా). అన్నీ మర్చిపోయే అల్జీమర్స్‌ వ్యాధి తండ్రికి మొదలై,ముదురుతోందని తెలియడంతో అల్జీమర్స్‌ తో తన జ్ఞాపకాలన్నీ చెరిగిపోక ముందే నవల రాయాలని కూతుర్ని కోరతాడు. ఈ క్రమంలో స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోలోని పోలీసు కేసుల ఎఫ్‌.ఐ.ఆర్‌లన్నీ డిజిటలైజ్‌ చేసి, సర్వర్‌లో అప్‌లోడ్‌ చేసే పనిలో ఉండగా ఆ సర్వర్‌ లో ఓ ఫోల్డర్‌ హ్యాక్‌ అవుతుంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్‌కు పరిచయమైన ఓ మహిళ హత్యకు గురికావడం,గణేశన్ ఈ కేసులో ఇరుక్కోవడంతో ఆయన్ని తప్పించడానికి తమన్నా ఏం చేసిందనేదే నవంబర్ స్టోరీ కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ సస్పెన్స్‌తో కూడా కథ, కెమెరా,నిర్మాణ విలువలు,తమన్నా నటన. తండ్రిని కాపాడుకోవడం కోసం శతవిధాల పోరాడే కూతురి పాత్రలో తమన్నా అద్బుతంగా నటించింది. హీరోయిన్‌ తండ్రి అయిన క్రైమ్‌ నవలా రచయిత గణేశన్, పోలీస్‌ ఎస్సై సుడలై (అరుళ్‌ దాస్‌), పోస్ట్‌ మార్టమ్‌ డాక్టర్‌గా పశుపతి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ మిస్సయిన లాజిక్, అసంపూర్తిగా నిండిన సీన్స్,పాత్రలు,క్లైమాక్స్‌.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సస్పెన్స్‌తో కూడాని కథ అయినా లాజిక్ మిస్సవడం మరో మైనస్ . సస్పెన్స్, క్రైమ్‌ మిస్టరీలు చూసేవారికి ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. రచన,దర్శకత్వం చేసిన రామ్‌ అలియాస్‌ ఇంద్రా సుబ్రమణియన్‌ను అభినందించకుండా ఉండలేరు. ఇక నిర్మాణ విలువలు వెబ్ సిరీస్‌ని మరోస్ధాయికి తీసుకెళ్లాయి.

తీర్పు:

తమిళ వెబ్ సిరీస్‌ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసిన స్టోరీ నవంబర్ స్టోరీ. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ.

సిరీస్‌: నవంబర్‌ స్టోరీ
నటీనటులు: తమన్నా, పశుపతి
దర్శకత్వం: ఇంద్రా సుబ్రమణియన్‌
నిర్మాత: తమిళ మేగజైన్‌ ‘ఆనంద వికటన్‌’
ఓటీటీ: డిస్నీ ప్లస్‌ – హాట్‌స్టార్‌

- Advertisement -