మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్

111
- Advertisement -

మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 21 నుండి 39 సంవత్సరాల మధ్య ఉండాలి.

రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల అధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోనుండగా దరఖాస్తులను పంపేందుకు సెప్టెంబర్ 5, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.

అభ్యర్థులు మెకానికల్ ఇంజినీరింగ్, ఆటో మొబైల్ ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటుగా, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

- Advertisement -