భూముల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్‌ రిలీజ్..

250
govt lands
- Advertisement -

నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజాపయోగ అవసరాల్లేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని సర్కారు నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భూముల అమ్మ‌కానికి సంబంధించి ఈ నెల 15 న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న‌ట్లు, 25 న ప్రీబిడ్ స‌మావేశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేసింది.

జులై 13 రిజిస్ట్రేష‌న్ల‌కు చివ‌రి తేదీ అని 15వ తేదీన ఈ వేలం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించింది. భూముల విక్ర‌యాల్లో భాగంగా కోకాపేట‌లో 49.95 ఎక‌రాలు, ఖానామెట్‌లోని 15.1 ఎక‌రాల‌ను ప్లాట్లుగా విక్ర‌యించ‌నున్నారు. కోకాపేట‌లోని భూముల‌ను హెచ్ఎండీఏ, ఖానామెట్‌లోని భూముల‌ను టీఎస్ఐఐసీ వేలం నిర్వ‌హించ‌నున్నాయి.

- Advertisement -