మొదలైన ముసలం..సీఎం కుర్చి కోసం కొట్లాట!

36
- Advertisement -

రేవంత్ రెడ్డికి సీఎం ఇచ్చేందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. శ్రీధర్ బాబు కు స్పీకర్ ఇస్తాను అనడం తో…నేను ఖాళీగా అయినా ఉంటాను కానీ నాకు అవసరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీధర్ బాబు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే నాకు ఒక్కడికి మాత్రమే ఇవ్వాలి…వేరే ఎవరికి ఇచ్చిన ఒప్పుకొనే ప్రసక్తి లేదు అంటూ తేల్చిచెప్పారు భట్టి విక్రమార్క.

సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు రేవంత్ రెడ్డి. సీతక్క కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదే లేదంటే తేల్చి చెప్పారు సీనియర్ నేతలు.ఇక ఈ సందర్భంగా పరుష పదజాలంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు సీనియర్ నేతలు.

దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిణామాలతో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.ఎటు తేలక పోవడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నుండి భట్టి, కోమటిరెడ్డి, దుద్దిల్ల, దామోదర్ రాజనర్సింహ వెళ్లిపోయారు. రేవంత్ నీ ముఖ్యమంత్రిగా మేము అంగీకరించలేమంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక ఢిల్లీ వెళ్లిపోయారు డీకే శివకుమార్.

Also Read:Congress:కాంగ్రెస్ ముందు పెను సవాళ్లు!

- Advertisement -