నోట్ల రద్దు..బడా బాబులకు ముందే తెలుసా..?

280
- Advertisement -

నల్లధనంపై ఉక్కుపా దం మోపుతూ కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ఆర్థిక లావాదే వీల కు బ్రేక్ పడినైట్లెంది. ఇక ఇటీవలి కాలంలో మార్కెట్లో పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేసిన వ్యక్తి అంబానీ. భారత్ లో అవినీతి నిర్మూలించాలనే ధ్యేయంగా మోడీ నిన్న తీసుకున్న నిర్ణయానికి ప్రముఖులంతా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే, పైగా ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని ప్రముఖులంతా సోషల్ మీడియా లో సందేశాలను పంపుతుంటే, భారత వ్యాపార దిగ్గజాలు అంబానీ సోదరులు మాత్రం ఈ విషయం పై ఎటువంటి స్పందన లేదు. కారణం మోడీ ఈ విషయాన్ని అంబానీ సోదరులకు ముందే చెప్పారని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అందుకే అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు పోటీగా ఉచితంగా రిలయన్స్ 4జీ టెక్నాలజీ ని అత్యంత అధునాతన స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని భారత ప్రజలందరికీ డిసెంబర్ 30 వ తేదీ వరకు ఉచితంగా ఇచ్చింది. అయితే అంబానీ సోదరులకు ఈ విషయం ముందుగానే తెలుసని అందుకే వారు ఈ ఆఫర్లను ప్రకటించారని వ్యాపార వర్గాలు కోడై కూస్తున్నాయి.ఇక ఇందుకు సంబంధించిన ఆధారాలను ప్రచురిస్తు సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు పోస్టుచేస్తున్నారు.

మోడీపై తొలుత సోషల్ మీడియాలో అనుకూలంగా ప్రచారం జరిగినా..తర్వాత పెద్ద నోట్ల రద్దుగురించి కారణాలు తెలుసుకుంటున్న ప్రజలు నోరు వెళ్లబెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నోట్ల రద్దు గురించి బిగ్ షాట్ అంబానీ మొదలుకొని…గుజరాత్ బడాబాబులకు,మోడీ సన్నిహితులకు ముందే తెలుసంటా. అందరు సర్దుకున్నాక….ఇదేదో నల్లధనాన్ని వెలికితీసేందుకు అంటూ మోడీ నాటకం మొదలుపెట్టారని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Not a secret? Modi's ministers leakes in April

ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం పోస్టు చేస్తున్నారు. గుజరాత్‌లో ఆరు నెలల క్రితమే ఓ పత్రికలో నోట్ల రద్దుకు సంబంధించి వార్త ప్రముఖంగా ప్రచురితమైంది. 500,1000 నోట్లు రద్దు కాబోతున్నాయని, అందరూ సర్దుకుంటున్నారనీ చెప్పే వార్త.

మొదట గుజరాత్‌లో తర్వాత బీజేపీ అగ్రనాయకులు, వారికి సహకరిస్తున్న వ్యాపార వర్గాలు సర్దుకున్నాక…ఇదేదో జాతినుద్దేశించి చేస్తున్నట్లు, ప్రకటనలు,ప్రసంగాలు..అంతిమంగా నష్టపోయింది మాత్రం సామాన్య జనమే.

Not a secret? Modi's ministers leakes in April

ఇక అక్టోబర్ 27న దైనిక్ జాగరణ్ కూడా ఒక అడుగు ముందుకేసి త్వరలో రెండు వేల రూపాయల నోటు రాబోతుందని..అంతేగాదు 500,1000 రూపాయల నోటుపై కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న వార్తను ప్రచురించింది. దీంతో ఒక రిపోర్టర్‌కే ఏం జరుగుతుందో తెలినప్పుడు…అంబానీ,అదానీలకు తెలియకుండా ఉంటుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం! అంతా పేదలు.. సగటు మధ్యతరగతి ప్రజలే! మోడీ నిర్ణయం నేపథ్యంలో కలవరపడుతున్నదీ ఆ బక్కజీవులే.నల్లధన కుబేరుల సంగతేమోగానీ.. మోడీ మోపిన ఉక్కుపాదం.. సాధారణ ప్రజలను కకావికలం చేసిపారేస్తున్నది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదే చర్చ. ఆటోల్లో బస్సుల్లో ఒకటే రచ్చరచ్చ! దేశంలో చేంజ్ తెస్తా అని మోడీ చెప్తుంటే అదేంటో అనుకున్నాంగానీ.. ఇలా చేంజ్ కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుందని అర్థంకాలేదని దిగాలుగా పడేసిన ముఖాలు! కొనుగోలుదారులు తగ్గిపోయి.. గిరాకీలేని చిన్న దుకాణాల వ్యాపారస్తులు! ఈ మధ్యే పీవోకేలో భారత్ నిర్వహించిన లక్షితదాడులకు వీరావేశంతో స్పందించి.. భేషన్న ప్రజలే.. ఇప్పుడు పెద్ద నోట్లపై చేస్తున్న లక్షిత దాడులతో ప్రభుత్వంపై అంతే స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం. ఇదో చారిత్రక సందర్భం అంటూ ప్రధాని మోడీ ప్రవచించిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం బీజేపీకి చారిత్రక తప్పిదంగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

- Advertisement -