ప్రెగ్నెన్సీ టైమ్ లో ముక్కు నుంచి రక్తం వస్తే.. ప్రమాదమా?

28
- Advertisement -

ప్రెగ్నెన్సీ టైమ్ లో మహిళలను రకరకాల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, కళ్ళు తిరగడం, వికారం, వాంతులు, తల నొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలను గర్భిణీ మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ సమస్యలన్నీ సర్వసాధారణమే అయినప్పటికి కొందరికి ఇంకొన్ని సమస్యలు కూడా తారసపడుతుంటాయి, ముక్కు నుంచి రక్తం కారడం, కొందరు మూర్ఛకు లోనవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. మూర్ఛ వచ్చిన వారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం ఎంతో మేలు. అయితే కొన్ని సందర్భలో గర్భిణిలకు ముక్కు లోంచి రక్తం కారుతుంటుంది..

ఇలా జరిగినప్పుడు సదరు మహిళలు భయపడుతుంటారు. కానీ ఇది ఒక సాధారణమైన చర్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగానే గర్భిణీ మహిళల శరీరం వేడికి లోనౌతుంటుంది. దాంతో అధిక వేడి కారణంగా కొందరిలో ముక్కు లోంచి రక్తం కారడం మొదలౌతుంది. ఇంకా ప్రగ్నెన్సి టైమ్ లో శరీరంలో రక్తం కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కారణం చేత కూడా ముక్కులో రక్తం వచ్చే అవకాశం ఉందట.

ఇంకా రోగనిరోధక శక్తిలో మార్పులు, అధిక ఒత్తిడి, ఆందోళన, వంటి ఇతరత్రా కారణాలు కూడా ఈ సమస్యకు కరణమౌతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా ముక్కులో నుంచి రక్తం కారడం ప్రమాదకరమైన విషయం కాదని, తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోదక శక్తి పెరగడానికి పండ్ల రసాలను ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ సమస్యకు తరచూ మెడిసన్ తీసుకోవడం అంతా మంచిది కాదని సమస్య తీవ్రత అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించక తప్పదని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:ఖుషి కోసం తీవ్రంగా శ్రమించిన సామ్!

- Advertisement -