తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల వివరాలను వెల్లడించారు. ఉత్తర & తూర్పు తెలంగాణ హాట్‌స్పాట్స్‌గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42°C చేరే అవకాశం ఉందని హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత 37-38°C ఉండవచ్చు అని తెలిపారు.
ఇక ఏపీలోని అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43°C చేరే అవకాశం ఉందని… ఈ ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంతర్రాష్ట్ర, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40°C పైగా ఉండే అవకాశం ఉందని.. విశాఖపట్నం గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C ఉండవచ్చు, మోస్తరు తేమ (Humidity) కొనసాగుతుంది అని చెప్పారు.
#24HrWx #Telangana
– Hot days to continue. North & East TG can remain as hotspots.
– Some places in Bhadradri Khammam Mahabubabad Mulugu Jayashankar Peddapalli Mancherial districts can reach 42*C.
– #Hyderabad max temp can be around 37-38*C with low humidity.#AndhraPradesh
-…— Weather@Hyderabad|TS|AP
(@Rajani_Weather) March 27, 2025
Also Read:వీడియో:గొరిల్లా దాహం తీర్చిన వ్యక్తి!