హీరో విశాల్ సినిమా షూటింగ్స్‌లో ఎంత కమిట్మెంట్తో ఉంటాడు అనడానికి ఇది తాజా నిదర్శనం. అతడు ప్రస్తుతం ఆయోగ్య అనే మూవీ చేస్తున్నాడు. ఏఆర్ మురగదాస్ దగ్గర అసోసియేట్‌గా పని చేసిన వెంకట్ మోహన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ముఖ్యమైన కోర్టు సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కోర్టు సెట్టింగ్ కూడా వేశారు. మూడు రోజుల పాటు ఏకధాటిగా ఈ షూటింగ్ జరుగుతున్నది.
ఈ మూవీలో హీరోయిన్ రాశి ఖన్నా, పార్థీపన్, రాధా రవి, కేఎస్ రవికుమార్లాంటి నటులు కూడా పాల్గొన్నారు. అయితే ఎవరి షూటింగ్ వాళ్లు చేసుకొని వెళ్లిపోగా.. విశాల్ మాత్రం ఏకధాటిగా 48 గంటల పాటు సెట్స్‌లోనే షూటింగ్‌కు అందుబాటులో ఉండటం విశేషం. సినిమాలో ముఖ్యమైన సన్నివేశం కావడంతో అతడు పూర్తి నిబద్ధతతో పని చేశాడని, అతని కమిట్మెంట్ చూసి సినిమా యూనిట్ అంతా ఆశ్చర్యంలో మునిగిపోయిందని ఈ సినిమా వర్గాలు వెల్లడించాయి.
తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన ‘టెంపర్’ సినిమాకు రీమేక్‌గా ‘అయోగ్య’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదివరకే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకటుకుంటోంది. ఒక నిమిషం 18 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్ లోని సన్నివేశాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయని చెప్పుకోవచ్చు. చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు.