కేఏ పాల్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్..!

388
KA paul
- Advertisement -

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరుకానందున వారెంట్ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి మిగతా నిందితులు హాజరైనప్పటికి పాల్ మాత్రం హాజరు కాలేదు. దీంతో, పాల్ కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు సమాచారం.

2010 జనవరి 30న తెల్లవారుజామున మూసాపేట మండలం సంకలమద్ది సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కారులో డ్రైవర్ సీటులో డేవిడ్‌రాజ్ విగతజీవిగా ఉండటం.. కారులోనే వేర్వేరు నంబర్ ప్లేట్లు లభించ డంతో పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు నిర్ధ్దారణకు వచ్చారు. హత్యలో మొత్తం 9 మంది ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. 2012 మే 21న ఒంగోలులో కేఏపాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం కేసు విచారణకు కేఏ పాల్ కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

- Advertisement -