- Advertisement -
నాలుగోదశ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు.
అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 114 నామినేషన్లు దాఖలుకాగా చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56, మెదక్ 54, కరీంనగర్ 53, వరంగల్ 58, ఖమ్మం 45, మహబూబ్‌నగర్ 42, నిజామాబాద్ 42, జహీరాబాద్ 40, నాగర్ కర్నూల్ 34, మహబూబాబాద్ 30, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.మే 13న పోలింగ్ నిర్వహించనుండగా జూన్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
Also Read:నడినెత్తిన నిప్పుల కుంపటి
- Advertisement -