కాంగ్రెస్ హామీలకు నో వారెంటీ!

35
- Advertisement -

కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నా సంగతి తెలిసిందే. అక్కడ 135 స్థానాల్లో విజయం సాధించి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి విధితమే. అయితే అక్కడ కాంగ్రెస్ కు ఆ స్థాయి విజయం రావడానికి ప్రదాన కారణం ఎన్నికల ముందు ఆ పార్టీ ప్రకటించిన హామీలే. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, నిరుద్యోగులకు మూడు వేల రూపాయల భృతి, పెన్షన్ పొడగింపు, అన్నభాగ్య వంటి ఐదు హామీలను ప్రకటించింది. బీజేపీ పాలనలో విసుగు చెందిన కన్నడ ప్రజానీకం.. హస్తం పార్టీ హామీల వైపు ఆశగా చూసింది.

దాహంలో ఉన్నవారికి నీటి జాడలు కనిపించినట్లు హస్తం పార్టీ హామీల ప్రకటన చూస్తి గంపగుత్తున కాంగ్రెస్ కు ఒట్లేసి గెలిపించారు అక్కడి ప్రజలు. కానీ గెలిచిన తరువాత సీన్ రివర్స్ అయింది. అవి నీటి జాడలు కాదు ఎండమవులని తరువాత అర్థమైంది. హామీల అమలులో ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు అక్కడి ప్రజల ఆగ్రహానికి గురి చేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి.. ఇంకా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, 200 యూనిట్ల కరెంటు.. ఇలా ప్రతిదాని అమలుకు బడ్జెట్ లేక చేతులెత్తేసిన పరిస్థితి. ఈ హామీల అమలు తమ వల్లకాదని స్వయంగా అస్తం నేతలే ఒప్పుకునే పరిస్థితికి దిగజారింది ఆ పార్టీ.

తమ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారెంటీ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే పడాక్షరి బహరింగా వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కూడా కర్నాటక హామీలనే ఐదు గ్యారెంటీలు అంటూ మళ్ళీ ఇక్కడ ప్రకటింక్చింది. దీంతో కాంగ్రెస్ హామీల పట్ల తెలంగాణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ముందు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆ హామీలను నెరవేర్చండని హితవు పలుకుతున్నారు. కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే పడాక్షరి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఇక్కడ పట్టిన గతే తెలంగాణకు కూడా పడుతుందని హెచ్చరించినట్లు ఉన్నాయంటూ రాజకీయవాదులు చెబుతున్నారు.

Also Read:ఆకలి వేయట్లేదా.. ఇలా చేయండి !

- Advertisement -