పవన్ తో తల ప్రాణం తోకకు వస్తుంది

50
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తన శక్తిని అంతా ధారపోసి చేస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా మూడేళ్ళ క్రితం మొదలైంది. కానీ ఇంతవరకు ఈ సినిమాకి శుభం కార్డు వేయలేకపోయాడు క్రిస్. కారణాలు ఏమైనా కావొచ్చు.. ఒక సినిమాని ఇలా మూడేళ్లు తీస్తే… నిర్మాత రత్నం పరిస్థితి ఏమిటి ?, అందుకే, ఇక వేగంగా ఈ సినిమాని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు క్రిష్. ఈ క్రమంలో హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా వేస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ ను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ కొత్త షెడ్యూల్‌ తో హరి హర వీరమల్లు షూటింగ్ 80 % పూర్త‌వుతుందట. కానీ, పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. దీంతో ఈ సినిమా సెట్ కూడా ఇప్పుడు పనికి వచ్చే పరిస్థితిలో ఉండదు. నిజానికి హరి హర వీరమల్లు సినిమా మధ్యలోనే ఆగిపోయింది అంటూ ఆ మధ్య బాగా ప్రచారం కూడా జరిగింది. కానీ, నిజానికి ఈ సినిమా ఆగిపోలేదు. ఆగుతూ సాగుతూ ఉంది. అసలు ఈ సినిమా లేట్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణే. ఇప్పుడు కూడా పవన్ సినిమాకి డేట్లు ఇవ్వడం లేదు.

కారణం.. ఈ సినిమా స్క్రిప్ట్ బాగాలేదు అని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడట. ఎప్పుడూ లేనిది ఈ సినిమాకి నలుగురు రచయితలను పెట్టుకున్నాడు దర్శకుడు క్రిష్. పైగా తన సినీ కెరీర్ లోనే ఈ సినిమా కోసం తీసుకున్నన్నీ జాగ్రతలు, మరో సినిమా కోసం క్రిష్ తీసుకోలేదు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలి అని క్రిష్ ఆశ. కానీ, చివరకు సినిమాని పూర్తి చేయడానికే క్రిష్ తల ప్రాణం తోకకు వస్తోంది.

Also Read:Telangana BJP:బీజేపీ లిస్ట్ రెడీ.. ?

- Advertisement -