పాపం.. రఘురామకు నో టికెట్?

35
- Advertisement -

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొన్నాళ్లుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపైనే తిరుగుబాటు గళం విప్పుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతూ ఉంటారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ.. ఈసారి వైసీపీకి దూరంగా ఉండనున్నారు. ఆయన బీజేపీ లేదా టీడీపీ లేదా జనసేన మూడింట్లో ఏదో ఒక పార్టీలో చేరతారనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర పెద్దలతో ఆయన సక్యతగా మెలుగుతూ రావడంతో బీజేపీలో చేరడం ఖాయమని భావించరంతా. బీజేపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసే ఆలోచన చేస్తూ వచ్చారు. కానీ రఘురామకు షాక్ ఇస్తూ నరసాపురం ఎంపీ టికెట్ శ్రీనివాస వర్మకు కేటాయించింది బీజేపీ.

దీంతో రఘురామను బీజేపీ ఎందుకు పక్కన పెట్టిందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ మరియు బీజేపీ పెద్దల మద్య రహస్య పొత్తు ఉందనే వాదన గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అందువల్ల వైసీపీపై రఘురామ చేసిన తిరుగుబాటు కారణంగానే ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రఘురామ టీడీపీలో చేరతారా ? ఒకవేళ టీడీపీలో చేరిన ఆయనకు నరసాపురం టికెట్ కేటాయించే అవకాశం లేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీ తీసుకోవడంతో ఇప్పుడు రఘురామ ఏం చేయబోతున్నాడనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలకు దూరం కావల్సిన పరిస్థితి. మరి రఘురామ ఎటు వైపు అడుగులు వేస్తాడో చూడాలి.

Also Read:Suriya:’కంగువ’ అదృష్టంగా భావిస్తున్నా

- Advertisement -