ముందస్తు ప్రసక్తే లేదు..

195
NO snap poll clarifies KCR
- Advertisement -

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని మంచిగా పనిచేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల అభిమానాన్ని చురగొన్నామని .. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తామని చెప్పారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని అవరోధాలను అధిగమించి ముందుకు వెళ్తామన్నారు.

ముస్లిం రిజర్వేషన్లపై చిత్తశుద్ది ఉందని స్పష్టం చేశారు. తమిళనాడులాగే తెలంగాణను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని సీఎం సూచించారు. రిజర్వేషన్ల కోసం ప్రధానికి కలుస్తామని తెలిపారు. ఎస్సీ,ఎస్టీల కోసం స్పెషల్ డెవలప్‌ మెంట్ ఫండ్ ఏర్పాటుచేస్తామన్నారు.

తమ ప్రభుత్వ పాలనలో రాజకీయ అవినీతిని సహించబోమని కేసీఆర్ హెచ్చరించారు. కుంభకోణాలు, లంబ కోణాలు ఉండబోవని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికను అధికారులే చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు కేవలం గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తారని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని వివరించారు. 15 రోజుల్లోనే 3 వేల 5 వందల సంస్థలకు అనుమతులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్‌లో మైక్రోమాక్స్ ఉత్పత్తి ప్రారంభించడానికి రెండున్నరేళ్లు పడితే తెలంగాణలో మూడు నెలల్లోనే ఉత్పత్తిని ప్రారంభించామని అ సంస్థ చెప్పిందన్నారు. రాష్ట్రంలో అవినీతి తగ్గిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం రూ.36 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు.

- Advertisement -