తెలంగాణలో రుణమాఫీ కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించింది. అంతే కాకుండా ఆరు గ్యారెంటీలలో కూడా పొందుపరిచింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ లోనే రైతు రుణమాఫీ జరుగుతుందని కాంగ్రెస్ నేతలు గట్టిగానే చెబుతూవచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయిన ఇంకా రుణమాఫీ జరగలేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతులు గగ్గోల్లు పెడుతున్నారు. అయితే రైతుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత కారణంగా రుణమాఫీపై ఆ మద్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రుణమాఫీకి సంబంధించిన కార్యాచరణ జరుగుతోందని త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. .
అయితే ఎప్పుడు ఎలా అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ తీరుపై రుణమాఫీ విషయంలో సందేహాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేధికగాగా రుణమాఫీపై ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ఏడాదికి రూ. 1.36 లక్షల కోట్లు అవసరమౌతుందని, డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికి అమలు చేయలేదని వెంటనే రుణమాఫీ అమలు చేయాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. అయితే రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఎంతవరకు ముందడుగు వేస్తుందనేది సందేహమే. హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నప్పటికి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రుణమాఫీపై కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తారా ? లేదా హామీ ఇచ్చినట్లు రూ.2 లక్షలను మాఫీ చేస్తారా ? అనేది చూడాలి.
Also Read:బొల్లి మచ్చలకు పరిష్కారం ఉందా?