యాసంగికి రైతుభరోసా లేనట్టేనా?

2
- Advertisement -

రైతు భరోసా అమలుపై అస్పష్టత నెలకొంది.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులకు భరోసా సాయం చేయకుండా వాయిదా వేసంది ప్రభుత్వం. ప్రస్తుత యాసంగి సీజన్లోనైనా ఇస్తుందా లేదా అన్నదానిపై అయోమయంలో ఉన్నారు రైతులు.

వానాకాలం సీజన్లో అదిగో ఇస్తాం. ఇదిగో చేస్తాం అంటూ ప్రభుత్వం కాలయాపన చేసిందని.. యాసంగిలోనూ అలాగే చేసే అవకాశం ఉందని కొందరు వ్యవసాయ శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

సీజన్ మొదలై నెల రోజులు దాటిందని, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటు వంటి స్పష్టత రాలేదని, పైగా ఈసారి కూడా భరోసా సాయం ఉండక పోవచ్చనే సంకేతాలు తమకు వస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఈసారి కూడా రైతుభరోసా లేనట్టేనా అని గుబులు చెందుతున్నారు రైతులు.

Also Read:సర్వే అధికారులకు ఎమ్మెల్యే మాధవరం షాక్

- Advertisement -