రుణమాఫీ ఇప్పట్లో లేనట్లే..?

18
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై ఇంతవరకు నోరు మెదపడంలేదు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తామని ఇలా కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మబ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఇలా చాలానే విమర్శలు వస్తున్నప్పటికి హస్తం నేతలు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. మొదట అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం, ఆ తరువాత రూ.500 వంటగ్యాస్, 200 ఉచిత కరెంటు, ఆరోగ్య స్త్రీ పెంపు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను వెంటవెంటనే అమలు చేయడంతో కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో ఆశలు చిగురించాయి..

కానీ ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. అమల్లోకి వచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందకపోవడం, ప్రతి నెల మహిళలకు రూ. 2500, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను ఇంకా పెండింగ్ లోనే ఉంచడంతో కాంగ్రెస్ పాలన పైన పటారం లోన లోటారం అన్నట్లుగా ఉందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి, మరి ముఖ్యంగా రైతు రుణమాఫీ కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పాలకులేమో ఇప్పుడు అప్పుడు అంటూ రైతు రుణమాఫీని దాటవేసే ప్రయత్నం చేస్తుండడంతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పేళ్లుబెక్కుతున్నాయి.

ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీపై సి‌ఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 15 నాటికి రైతురుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వెల్లడించారు, దీంతో ఇప్పట్లో రైతురుణమాఫీ లేనట్లేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన హస్తం నేతలు ఇప్పుడు మాట మార్చడంతో ఆగష్టు లోనైనా రుణమాఫీ జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది. మొత్తానికి రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో రైతు రుణమాఫీ ఇప్పట్లో లేనట్లే అని తేలిపోయింది.

Also Read:గసగసాలు ఎక్కువగా వాడుతున్నారా?

- Advertisement -