టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో ఈ నెల 23 నుంచి ప్రారంభం అయ్యే చివరి టెస్టు మ్యాచ్ నామమాత్రంగానే జరగనుంది. దీంతో ఆల్రెడీ సిరీస్ సొంతం చేసుకోవడంతో టీమిండియా జట్టు కూర్పులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మకు చివరి టెస్టు మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో యజమాన్యం ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తే సారథ్య బాద్యతలు ఎవరు చేపతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం క్రీడా వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ఆశ్చర్యం లేదు. .
ఎందుకంటే చివరి టెస్టుతో వందో టెస్టు పూర్తి చేసుకొనున్నాడు అశ్విన్. దీంతో అతనికి గుర్తుండిపోయేలా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిజంగానే రోహిత్ శర్మ దూరమైతే ఓపెనర్ గా ఎవరు బరిలోకి దిగుతారనేది కూడా అందరిలో మెదలుతున్న ప్రశ్న. గత రెండు టెస్టు మ్యాచ్ లకు గాయం కారణంగా దూరమైన కేఎల్ రాహుల్ చివరి టెస్టు మ్యాచ్ లోనైనా అందుబాటులోకి వస్తాడా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ కేఎల్ రాహుల్ చివరి టెస్టుతో అందుబాటులోకి వస్తే ఓపెనర్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక మూడో టెస్టులో రెస్ట్ తీసుకున్న బుమ్రా చివరి టెస్టు కూడా రెస్ట్ లోనే ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా చివరి టెస్టు భారమంతా కుర్రాళ్లే మోయనున్నారు. అటు ఇంగ్లాండ్ మొదటి టెస్టు మినహా ఆ తర్వాత వరుసగా మూడు టెస్టుల్లోనూ ఓటమి చవిచూసింది. దీంతో కనీసం చివరి టెస్టు మ్యాచ్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.
Also Read:TTD:విజయవంతంగా 12వ గుండె మార్పిడి