- Advertisement -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువైంది. 294 మద్యం దుకాణాలకు కేవలం 8 దరఖాస్తులే రావడంతో అవాక్కయ్యారు అబ్కారీ శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో గత నెల 26వ తేదీ నుండి మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించింది ఎక్సైజ్ శాఖ.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 మద్యం దుకాణాలు ఉండగా, కేవలం 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వరంగల్ జిల్లాలో 57 షాపులకు 3 దరఖాస్తులు,హన్మకొండ జిల్లాలో 67 షాపులకు ఒకటి,జనగామ జిల్లాలో 50 షాపులకు 2,మహబూబాబాద్ జిల్లాలో 61 షాపులకు 2 దరఖాస్తులు దాఖలు చేశారు వ్యాపారులు.
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 59 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.
Also Read:వేశ్యలపై భారతీయుల దాడి..జైలు శిక్ష!
- Advertisement -

