పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. జనవరి 10వతేదీ (రేపు) విడుదల కానున్న ఈ సినిమాకు ఈ అర్థరాత్రి నుంచి ప్రీమియర్ షోలతోపాటు రోజూ అదనపు ఆటలు వేసుకునేందుకు అనుమతి నిరాకరించింది .
ప్రీమియర్ షోల కోసం కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లిఖార్జున, ఆర్కే థియేటర్లు పోలీస్ శాఖకు లేఖ రాశారు. అయితే భద్రతా కారణాలు, ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అజ్ఞాతవాసి సినిమా స్పెషల్ షోలు వేయరాదని సినిమా ధియేటర్ల యాజమాన్యాలను ఫ్రభుత్వం ఆదేశించింది.
గతంలో ప్రీమియర్ షోలు వేసినప్పుడు పలుచోట్ల తొక్కిసలాట, గొడవలు జరిగిన విషయాన్ని ధియేటర్ యాజమాన్యాలకు గుర్తు చేస్తూ.. హైదరాబాద్ సిటీలో భద్రత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఫ్యాన్స్ అంతా సహకరించాలని కోరారు. కాగా..యథావిధిగా రేపు ఉదయం 8 గంటల నుంచి మల్టీఫ్లెక్సుల్లో, 10 గంటలకు సింగిల్ ధియేటర్లలో సినిమా మొదటి ఆట పడనుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశచెందారు.