AP:ఫస్టొచ్చింది… పెన్షన్ రాలేదు

19
- Advertisement -

ఏపీలో ప్రతినెల ఒకటో తేదీ వచ్చిందంటే ప్రతీ ఇంట్లో సంతోషం వెల్లివిరిసేది. పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటికే పెన్షన్ అందేది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యామా పరిస్థితి మారిపోయింది.

ఫస్టోచ్చింది పెన్షన్ మాత్రం రాని పరిస్థితి నెలకొంది.  చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు… అయన వచ్చి డబ్బులిస్తే మందులు… పప్పు ఉప్పు…సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు… చేతిలోకి పైసలు పడలేదు…ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రలవల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు..నిలబడడం..ఆ ఫారాలు నింపడం ..ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ ) లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి.

ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే… అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక … సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు.

Also Read:వరంగల్ కాంగ్రెస్‌లో ముసలం

- Advertisement -