శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు

5
- Advertisement -

తిరుమల క్షవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కుటుంబ సమేతంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సమీపంలో పలు ప్రాంతాలను సందర్శించారు చంద్రబాబు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడారు.

తన పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గాయత్రి నిలయం వద్ద సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీటీడీ అధికారులు ఎవరూ రాలేదు. వాహనం దిగి గాయత్రీ నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవీ వీరబ్రహ్మం యత్నించగా.. ముఖ్యమంత్రి తిరస్కరించారు.

సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో పరదాలు దర్శనమిచ్చాయి. పరదాలు ఏర్పాటు చేసిన అధికారులపై ముఖ్యమంత్రి సీరియన్ అయినట్టు తెలుస్తోంది. పాత పద్ధతులు వీడాలని హితవు పలికారు. వెంటనే వాటిని అధికారులు తొలగించారు.

Also Read:కాల్షియం తగ్గిందా.. అయితే!

- Advertisement -