పూజా హెగ్డేకి ఆ అవకాశం వస్తోందా?

19
- Advertisement -

సర్రున దూసుకు వచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే. వరుసగా ఫ్లాపులు, డిజాస్టర్లు పలకరించడంతో, డిమాండ్ కాస్తా రివర్స్ లో వెళ్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఓ సినిమా వుంది. ప్లానింగ్ లో మరో సినిమా వుంది. ప్లానింగ్ లో వున్న సుత్ర్య – గౌతమ్ మీనన్ సినిమా సంగతి క్లారిటీ లేదు కానీ సల్మాన్ ఖాన్ సరసన చేస్తున్న రెండో సినిమా మాత్రం ఇంకా పూజా హెగ్డే చేతిలోనే వుంది. వారం రోజులు ఆమెపై షూట్ కూడా చేసారు. ఈ లోగానే పూజా హెగ్డే లేదంటూ వార్తలు పుట్టుకువచ్చాయి. కానీ అవి నిజం కాదు.

అయితే సల్మాన్ ఖాన్ సినిమా సంగతి పక్కన పెడితే.. పూజా హెగ్డే కెరీర్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు డౌట్ గా మారింది. మొత్తానికి సర్రున దూసుకువచ్చి, అంతే స్పీడ్ గా పూజా హెగ్డే నేలకు జారిపోయింది. ఇప్పుడు కొత్త సినిమాలు ఏవీ ప్లానింగ్ లో లేవు. పైగా ప్రతి సినిమాలో ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ లు చేసేసి, జనాలకు బోర్ కొట్టించేసుకుంది తనకు తానే. దీనికితోడు గుంటూరు కారం సినిమా కోసం ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి, మొత్తమ్మీద పూజా హెగ్డే అటు నిర్మాతల సైడ్ నుంచి బ్యాడ్ అయ్యింది.

అయితే, ఇక చాలు పూజా హెగ్డే అనేంతగా ఆమె ఇంకా ఫేడ్ అవుట్ అవ్వలేదు. దాదాపు మొహం మొత్తించేసింది అంటున్నారు. కానీ ఒక్క హిట్ పడితే.. మళ్లీ పూజా హెగ్డే ఫామ్ లోకి వస్తోంది. అప్పుడు నిర్మాతలు, దర్శకులు కూడా పూజా హెగ్డే పై ఫోకస్ పెడతారు. ఓవరాల్ గా ఇప్పుడు మంచి పాత్ర పడితే తప్ప పూజా హెగ్డే ప్రూవ్ చేసుకునే అవకాశం లేదు. మరి పూజా హెగ్డేకి ఆ అవకాశం వస్తోందా ? చూడాలి.

Also Read:స్పెర్మ్ కౌంట్ పెంచే ఆహార పదార్థాలు!

- Advertisement -