పాపం.. నిధి అగర్వాల్ ఇక కష్టమే

36
- Advertisement -

హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. దానికి కారణం ఆమెకి రెండేళ్ల క్రితం సడెన్ గా పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటించే అవకాశం రావడమే. నిధి అగర్వాల్ ని తమ సినిమాలో తీసుకున్నామని దర్శకుడు క్రిష్ ప్రకటించిన వెంటనే ఆమె జీవితం, కెరీర్ మారిపోయింది. వరుసగా మరో నాలుగు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అందులో, రెండు తెలుగు, ఒకటి తమిళం. ఇక హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలు కాగానే ఈ భామకి విశాల్ సరసన ఒక మూవీ, అజిత్ సరసన మరో మూవీలో ఛాన్స్ వచ్చిందని టాక్ నడిచింది.

ఐతే, ఆ అవకాశాలతో పాటు అడ్డంకులు కూడా వచ్చాయి. దీనికితోడు హరి హర వీరమల్లు సినిమా ఆగుతూ సాగుతూ ఉండటంతో నిధి అగర్వాల్ సినీ భవిష్యత్తు మళ్లీ అగాధంలోకి వెళ్ళిపోయింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. ఐతే ఎన్నికల కారణంగా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లను పక్కన పెట్టేశారు. ఆంధ్రపదేశ్ ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పవన్ కళ్యాణ్ సినిమాల వైపు చూపు వెయ్యరు. అలా “ హరి హర వీరమల్లు సినిమా” మధ్యలో ఆగింది. మొత్తానికి నిధి అగర్వాల్ కి మళ్లీ మరో అవకాశం వచ్చేలా కనిపించడం లేదు. వచ్చిన అవకాశాలు ఏమో పోయాయి.

వాస్తవానికి బాలయ్య – బాబీ చిత్రంలో నిధి అగర్వాల్ ని తీసుకున్నప్పటికీ ఆమెకి అడ్వాన్స్ ఇవ్వలేదు. ఆమె పేరు కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ తడిసి మోపెడు అయ్యేలా ఉందని నిర్మాణ సంస్థ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా డిమాండ్ ఉన్నవారినే సినిమాలో పెట్టుకునేలా ప్లాన్ చేస్తోంది. కాబట్టి, మార్కెట్ పరంగా ఏ మాత్రం డిమాండ్ లేని నిధి అగర్వాల్ కి ఛాన్స్ రావడం కష్టమే. పాపం నిధి అగర్వాల్ అందాలు ఆరబోసినా.. ఆమెకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

Also Read:బాబు ప్లాన్.. ఎన్నికల ప్రచారంలో ఆ ఇద్దరు?

- Advertisement -