Krithi Shetty:పోటీ పెరిగింది ఊపు తగ్గింది

56
- Advertisement -

హీరోయిన్ కృతి శెట్టికి మొదట గోల్డెన్ లెగ్ అన్న ఇమేజ్ వచ్చింది. ఎందుకంటే ఆమె పట్టిందల్లా బంగారమే. ఆమె నటించిన చిత్రాలు కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. దీనికితోడు కృతి శెట్టి క్యూట్ నెస్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇలా సక్సెస్ లు అందుకున్న హీరోయిన్ కి సహజంగానే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కానీ, ఎందుకనో ఈ మధ్య కృతి శెట్టికి ఆఫర్లు అనుకున్నంతగా రావట్లేదు. ఇప్పుడు ఆమె చేతిలో కేవలం రెండు మూవీలు మాత్రమే ఉన్నాయి. ఇంకా కొత్తగా ఏది సైన్ చేయలేదు. అనౌన్స్ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కృతి శెట్టికి మంచి ఆఫర్లు వస్తేనే.. ఆమెకు హీరోయిన్ గా కొన్నాళ్ళు పాటు సస్టైన్ అవ్వగలదు.

ఇప్పటికే కృతి శెట్టికి శ్రీలీల రూపంలో గట్టి పోటీ ఉంది. దీనికి తోడు తాజాగా విడుదలైన ‘విరూపాక్ష’ కూడా బాగా ఆడుతోంది. ఈ సినిమాలో నటించిన సంయుక్త మీనన్ కి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ఖాతాలో విరూపాక్ష రూపంలో భారీ బ్లాక్ బస్టర్ పడింది. కాబట్టి, కృతి శెట్టికి సంయుక్త మీనన్ రూపంలో కూడా గట్టి పోటీ ఎదురుకానుంది. సో.. ఏ రకంగా చూసుకున్నా.. కృతి శెట్టి అలర్ట్ కావలసిన సమయం వచ్చేసింది.

Also Read:BRS:తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక

నిజానికి కృతి శెట్టికి బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. కాకపోతే.. కృతి శెట్టి కొంచెం ఎక్కువ రేట్ కోట్ చేస్తోంది అనేది ఒక కామెంట్. అలాగే, సినిమా ఒప్పుకున్న తర్వాత ఆమె మరిన్ని డిమాండ్స్ చేస్తోందట. అందుకే, కాబోలు నిర్మాతలు ఎగబడి కృతి శెట్టిని సైన్ చెయ్యడం లేదు. ఈ విషయంలో కృతి శెట్టి ఆలోచించుకుంటే మంచిది.

Also Read:జై కేసీఆర్..జై భారత్

- Advertisement -