Samyuktha:సక్సెస్ ఫుల్ హీరోయిన్.. కానీ ఖాళీ!

28
- Advertisement -

తెలుగులో సంయుక్త మీనన్ నటించిన రెండు తెలుగు సినిమాలు బింబిసారా, విరూపాక్ష ఇప్పటికే విడుదల అయ్యాయి. మంచి విజయాలను సాధించాయి. పైగా తమిళ డబ్బింగ్ సినిమా ‘సార్’ చిత్రం కూడా మంచి విజయాన్నే అందుకుంది. సో.. మూడు సినిమాలు చేసినా తెలుగులో సంయుక్త మీనన్ కి ఒక్క ప్లాప్ కూడా లేదు. పైగా, అన్ని సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టాయి. ఇక నాలుగో చిత్రం “డెవిల్” రిలీజ్ కి రెడీగా ఉంది. మరి ఈ సినిమా తర్వాత సంయుక్త మీనన్ ఏ సినిమాలు ఒప్పుకుంటుంది? అనే ఆసక్తి అందరిలో ఉంది. ‘విరూపాక్ష’ ఆమెకి తొలి విజయం తెలుగులో.

రెండో చిత్రంగా “ బింబిసారా ” విడుదలైంది. అమెరికాలో $1.8 మిలియన్ (15 కోట్ల రూపాయల) భారీ వసూళ్లు అందుకొంది ఈ చిత్రం. నైజాంలో కూడా మంచి వసూళ్లు పొందింది. ఇతర ఏరియాల్లో పెద్దగా వసూళ్లు చెయ్యకపోయినా ఓవరాల్ గా “సాలిడ్ హిట్” “అనిపించు”కొంది. ఆ విధంగా బింబిసారా సినిమాతో సంయుక్త మీనన్ పాస్ అనిపించుకొంది. అయినా, ఎందుకో సంయుక్త మీనన్ కి ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆమెకి “విరూపాక్ష” విజయంతో సంబంధం లేకుండానే ఇప్పటికే రెండు, మూడు ఆఫర్లు వచ్చి ఉండాలి.

ఐతే, సంయుక్త మీనన్ సినిమాల లిస్ట్ మాత్రం పెద్దగా పెరగలేదు. ఐతే, దీనికి కారణం సంయుక్త మీననే అని తెలుస్తోంది. ఈ అమ్మడు తాను సినిమాలు ఒప్పుకునే విషయంలో కొన్ని నియమాలు పాటిస్తోంది. తాను నటించే హీరోకి కానీ, దర్శకుడికి కానీ, నిర్మాణ సంస్థకి కానీ బాగా ‘క్రేజ్’ ఉండాలని షరతులు పెడుతుంది. దానికి తోడు తన పారితోషికం విషయంలో డిస్కౌంట్లు అడగొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ లు కూడా చేస్తోందట. అందుకే, సంయుక్త మీనన్ సినిమాల కౌంట్ పెద్దగా పెరగడం లేదు అని టాక్. ఏది ఏమైనా సంయుక్త మీనన్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గా ముద్ర పడింది. కానీ పాపం ఎక్కువగా ఖాళీగానే ఉంటుంది.

Also Read:ప్రియాంక గాంధీ ఇకపై సౌత్ లోనే?

- Advertisement -