మాస్కు లేకుంటే వెయ్యి జరిమానా..!

169
contonment
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు స్వల్పంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో రోజుకు 300కి పైగా కేసులు నమోదవుతుండగా గత రెండు రోజుల్లో 500కు చేరువయ్యాయి. మరోసారి కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం అన్నిరాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇక కరోనా కట్టడిలో భాగంగా మాస్క్‌ను తప్పనిసరి చేసింది ఏపీ సర్కార్‌. రాష్ట్రవ్యాప్తంగా ‘నో మాస్క్‌.. నో ఎంట్రీ’ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. మాస్క్ ధరించని వారికి రూ. వెయ్యి రూపాయల జరిమానా విధించాలని తెలిపింది. పబ్లిక్‌ ప్రదేశాలల్లో మాస్కులు లేకుండా ఎవరు తిరిగినా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఏపీలో విద్యా సంస్థల్లో కోవిడ్ కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరులోని ఓ జూనియర్‌ కాలేజీలో ఏకంగా 140 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితులను వసతి గృహాల్లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్‌గా ప్రకటించారు.

- Advertisement -