జవాన్లకు నివాళి..ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ రద్దు

249
ipl
- Advertisement -

పొట్టి క్రికెట్ మహాసంగ్రామం ఐపీఎల్‌కు ప్రారంభానికి మరికొద్దిరోజులు మాత్రమే మిగిలింది. 11 సీజన్‌లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసుకున్న ఐపీఎల్‌..12వ సీజన్‌ కోసం సర్వం సిద్ధమైంది. ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఒక ఎత్తైతే…ఆరంభ వేడుకలు మరింత ఆకర్షణ తీసుకొస్తాయి. ప్రపంచదేశాల మోడల్స్‌,బాలీవుడ్ తారాగణం ఆరంభ వేడుకల్లో సందడి చేస్తారు. బాణాసంచా వెలుగుల్లో ఐపీఎల్ ఆరంభ వేడుకలు జిగేల్‌ మనిపిస్తాయి.

కానీ ఈసారి ఐపీఎల్ ఆరంభ వేడుకలకు బ్రేక్ పడింది.పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వేడుకలను రద్దు చేసిన ఐపీఎల్ కమిటీ…కార్యక్రమానికి ఖర్చు చేసే మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. అమరులైన జవాన్ల గౌరవార్థం ఈ సారి వేడుకలు రద్దుచేస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ సీకే ఖన్నా తెలిపారు.

మార్చి 23న ఐపీఎల్‌ 12వ ఎడిషన్‌ ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి.ఎన్నికలు,ఐపీఎల్‌ ఒకేసారి జరగనుండటంతో తొలుత 17 మ్యాచ్‌ల షెడ్యూల్‌ని మాత్రమే ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు వచ్చిన తర్వాత మొత్తం షెడ్యూల్‌ని ప్రకటించనున్నారు.

- Advertisement -