గ్రూప్ 1…ఇంటర్వ్యూలు లేవు

38
groups
- Advertisement -

తెలంగాణ నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వెలువడ్డ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ కావడం విశేషం.

ఇటీవలే గ్రూప్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్, మెయిన్స్ (రాత పరీక్షలు) అనే రెండు దశల ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష మెయిన్స్‌కు అర్హత పరీక్ష మాత్రమే.

2014లో TSPSC ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్ ఇది. మొట్టమొదటిసారి భారీ సంఖ్యలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ చేయనుండగా మే 2 నుండి మే 31 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల స్వీకరించనున్నారు. ఆబ్జెక్టివ్ టైప్ (ప్రిలిమినరీ), రాత పరీక్ష (మెయిన్స్) రెండు రౌండ్లలో గ్రూప్ – 1 ఎగ్జామినేషన్ ఉండనుంది. 2022 నవంబర్/డిసెంబర్‌లో జరగనున్న మెయిన్స్ రాత పరీక్ష (కన్వెన్షనల్ టైప్) జరగనుంది.

గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకునే ముందే TSPSC OTRలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. లేదా కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం OTRను అప్ డేట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి గ్రూప్-1 విద్యార్హతలన్నీ కలిగి ఉండాలి. గ్రూప్-1 సర్వీసుల్లో మొదటిసారి EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు.. మొదటిసారి ఉర్దూలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండనుంది. మెయిన్స్‌లో అభ్యర్థులకు ప్రింటెడ్‌కు బదులు ఈ-క్వశ్చన్ పేపర్ ఇవ్వనున్నారు. సెలెక్షన్ ప్రాసెస్ వేగవంతం చేసేందుకు మెయిన్స్‌లో డిజిటల్ ఎవాల్యుయేషన్ చేపట్టనున్నారు.

ఉద్యోగాల ఖాళీల వివరాలు…

డిప్యూటీ కలెక్టర్ (సివిల్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) – 42
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీలు) (కేటగిరీ-2) – 91
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(సీటీవో) – 48
రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్(ఆర్టీఓ) – 4
డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్(జిల్లా పంచాయ‌తీ ఆఫీస‌ర్లు) – 5
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్(జిల్లా రిజిస్ట్రార్లు)-5
డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) – 2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ – 8
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ – 26
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 2) – 41
అసిస్టెంట్ డైరెక్టర్-డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 3
డిస్ట్రిక్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ – 5
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 2
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ – 2
ఏఓ లే సెక్రటరీ & ట్రెజరర్ (గ్రేడ్ 2)- 20
అసిస్టెంట్ ట్రెజరర్/అకౌంట్స్/లెక్చరర్ – 38
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ – 40
మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 121

- Advertisement -