బడ్జెట్‌ 2024..సామాన్యులకు షాకిచ్చిన కేంద్రం

23
- Advertisement -

కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రాపర్టీ సేల్‌పై ఇన్నాళ్లూ ఉన్న ఇండెక్సేషన్‌ బెన్‌ఫిట్స్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇకపై నో ఇండెక్సేషన్‌ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 15 ఏళ్లు దాటిన ప్రాపర్టీలు అమ్మితే..ఇకపై 12.5 శాతం పన్ను కట్టాల్సిందేనని తెలిపింది.

ఇప్పటివరకు ఇండెక్సేషన్‌ మినహాయింపు ఉండగా దానిని తీసేసింది కేంద్రం. ఇల్లు అమ్మితే లాభాల్లో 12.5% ట్యాక్స్ కట్టాల్సిందేనని, లాంగ్‌టర్మ్‌ కేపిటల్‌ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను చెల్లించాలని తెలిపింది.

కేంద్రం చెప్పిన ఈ ఒక్క ప్రకటనతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒక్కసారిగా పడిపోయాయి. స్థిరాస్తి అమ్మకాలపై నిర్మలా సీతారామన్ ప్రకటన రాకముందు లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్‌ పై ఇండెక్సేషన్‌ బెన్‌ఫిట్స్‌తో కూడిన 10 శాతం పన్ను ఉండేది. కానీ ఇప్పుడు ఇండెక్సేషన్ బెన్‌ఫిట్స్‌ను తొలగించి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై 12.5 వాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Also Read:సూర్య బర్త్ డే..’కంగువ’ ఫస్ట్ సింగిల్ ‘

- Advertisement -