సోనాక్షి సిన్హా వివాహంపై శత్రుఘ్న సిన్హా

14
- Advertisement -

తన కూతురు సోనాక్షి సిన్హా వివాహంపై ఎట్టకేలకు స్పందించారు నటుడు శత్రుఘ్న సిన్హా .ఈనెల 23న ముంబైలో జహీర్‌ ఇక్బాల్‌ను సోనాక్షి వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే.

తన కూతురి వివాహ ప్రణాళికలపై ఎవరితోనూ మాట్లాడలేదని…సోనాక్షి, జహీర్‌ వివాహం గురించి తనకు తెలియదని అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలతోనే ఈ విషయం తెలుసుకున్నానని…ఆమె సంతోషంగా ఉండాలనే తాము ఎప్పుడూ కోరుకుంటామని స్పష్టం చేశారు.

సోనాక్షి తన నిర్ణయాలను తాను సొంతంగా తీసుకునే హక్కు కలిగి ఉందని…ఆమె నిర్ణయాల పట్ల తాము నమ్మకంతో ఉంటామని, ఆమె ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోదని అన్నారు.

Also Read:RT75:రవితేజ 75 ప్రారంభం

- Advertisement -