- Advertisement -
హైదరాబాద్ ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ లో హలీమ్ ఒకటి. రంజాన్ మాసంలో మాత్రమే దొరికే హలీమ్ ను ఇష్టపడని వారంటూ ఉండరు. చాలామంది హలీం ప్రియులు రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా… ఎప్పుడు హలీం తిందామా అని కూడా వెయిట్ చేస్తుంటారు.
ఏ గల్లీ చూసిన హలీం ఘుమఘుమలే..అలాంటి ఈసారి రంజాన్ హలీం రుచి చూసే ఛాన్సే లేదు. ఎందుకంటే కరోనా నేపథ్యంలో హైదరాబాద్ హలీం తయారీ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో ఎక్కడా కూడా హలీమ్ తయారీ చేయడం లేదని…. లాక్ డౌన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉండవని హలీం అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ సారి హలీం లేదన్న వార్త భోజన ప్రియులను నిరాశకు గురిచేస్తోంది.
- Advertisement -