ధర్నా చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావు..!

132
bihar
- Advertisement -

నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. బిహార్‌లో హింసాత్మక నిరసనలకు దిగడం, రహదారుల దిగ్భందానికి పాల్పడటం, ధర్నాల్లో కూర్చోవడం వంటి చర్యలకు పాల్పడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావని తేల్చి చెప్పింది.

అలాగే ధర్నాల్లో పాల్గొనే వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కవనీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు బిహార్ పోలీసులు. నిరసనల్లో హింసచెలరేగితే ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారి సర్టిఫికెట్లు, ప్రవర్తన ధ్రువీకరణ పత్రాల్లో రిమార్క్‌ రాస్తారని బిహార్‌ డీజీపీ ఎస్‌కే సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవలె ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు చేపడతామని బిహార్‌ పోలీసులు ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా మరోసారి వివాదాస్పద ఉత్వర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -