TTD:గరుడ సేవ రద్దు

31
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆల‌యంలో డిసెంబ‌రు 26వ తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.శ్రీ‌వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కార‌ణంగా పౌర్ణ‌మి గరుడసేవ ఉండదు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

డిసెంబర్ 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్లను జారీ సోమ‌వారం ఉద‌యం 4.27 గంట‌ల‌కు పూర్తి చేశారు. తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాలు, భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్క‌రిణి, ఇందిరా మైదానం, జీవ‌కోన హైస్కూల్‌, బైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు హైస్కూల్‌, ఎంఆర్ ప‌ల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో 90 కౌంట‌ర్లలో 10 రోజుల‌కు గాను 4 ల‌క్ష‌లకుపైగా స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను సోమ‌వారం ఉద‌యానికి జారీ చేయ‌డం పూర్త‌యింది. తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ‌ తేదీ నుండి ఇవ్వటం జరుగుతుందని అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించగలరని పేర్కొంది.

Also Read:ప్రియాంక గాంధీ ఇకపై సౌత్ లోనే?

- Advertisement -